subramanya astakam
సుబ్రహ్మణ్య అష్టకం- కరావలంబ స్తోత్రం
హే స్వామినాథ కరుణాకర దీనబంధో
శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మబంధో
శ్రీశాది దేవ గణ పూజిత పాదపద్మ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ (1)
దేవతలలో శ్రేష్ఠుడు, కరుణని చూపువాడు, దీనులను ఆపదలు నుండి కాపాడే బంధువు వంటివాడు
పద్మము వంటి ముఖం కలిగిన పార్వతీ దేవి యొక్క కుమారుడు
విష్ణువు మరియు ఇతర దేవ గణములచే పూజింపబడ్డ పాద పద్మములు కలవాడు
వల్లీ నాథుడగు సుబ్రహ్మణ్య స్వామి, నాకు చేయూతనిమ్ము
దేవాదిదేవ సుత దేవగణాధి నాథ
దేవేంద్ర వంద్య మృదుపంకజ మంజుపాద
దేవర్షి నారద మునీంద్ర సుగీత కీర్తే
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ (2)
దేవాదిదేవుడగు పరమేశ్వరుని పుత్రుడు, దేవ గణాలకు అధిపతి
దేవేంద్రునిచే నమస్కరింపబడ్డ మృదువైన పద్మములవంటి పాదములు కలిగినవాడు
ఎవరి గొప్పదనాన్ని దేవర్షి అగు నారద మునీంద్రులు మరియు ఇతర మునీంద్రులు కీర్తనల ద్వారా కీర్తించురో అట్టి
వల్లీ నాథుడగు సుబ్రహ్మణ్య స్వామి, నాకు చేయూతనిమ్ము
నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్
భాగ్య ప్రధాన పరిపూరిత భక్తకామ
శృత్యాగమ ప్రణవ వాచ్య నిజస్వరూప
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ (3)
నిత్యము అన్నదానము చేయువాడు, ఎల్లప్పుడూ భక్తుల రోగములు హరింపచేయువాడు
భాగ్యమును ప్రసాదించి భక్తుల కోర్కెలను పరిపూర్ణము చేయువాడు
వేదముల యందు వివరించబడిన ప్రణవము యొక్క నిజస్వరూపమగు
వల్లీ నాథుడగు సుబ్రహ్మణ్య స్వామి, నాకు చేయూతనిమ్ము
క్రౌంచా సురేంద్ర పరిఖండన శక్తిశూల
పాశాది శస్త్ర పరిమండిత దివ్యపాణే
శ్రీకుండలీశ దృత తుండ సిఖీంద్ర వాహ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ (4)
శ్రేష్ఠమగు పర్వతముల నందు నివసించువాడా, శక్తి మరియు శూల ఆయుధములు కలిగిఉన్నవాడా
దివ్యమగు తన చేతి యందు పాశము, ఇతర శస్త్రములు కలిగిఉండి
చెవి కుండలములు కలిగి, వేగముగా వెళ్ళు నెమలిని వాహనముగా కలిగిఉన్న
వల్లీ నాథుడగు సుబ్రహ్మణ్య స్వామి, నాకు చేయూతనిమ్ము
దేవాదిదేవ రథమండల మధ్య వేద్య
దేవేంద్ర పీఠ నగరం దృఢచాప హస్తమ్
శూరం నిహత్య సురకోటి భిరీడ్యమాన
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ (5)
దేవాదిదేవుడగు పరమేశ్వరుని గుణములు కలవాడు, రథముల సమూహము మధ్యలో తన రధమును నడుపువాడు
దేవేంద్రుని నగరము నందున్న వారి కష్టములను పోగొట్టి తన హస్తమును రక్షణగా ఉంచి
సురత్వము కలిగి, శత్రువులను వధించి, సురకోటిచే (దేవతలచే) కీర్తింపబడ్డ
వల్లీ నాథుడగు సుబ్రహ్మణ్య స్వామి, నాకు చేయూతనిమ్ము
హారాది రత్న మణియుక్త కిరీటహార
కేయూర కుండల లసత్కవచాభిరామ
హే వీర తారక జయామర బృంద వంద్య
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ (6)
రత్నములు, మణులచే చేయబడ్డ కిరీటము, హారములు కలిగి
కుండలములు, భుజకీర్తులు ధరించి, ప్రకాశవంతమగు కవచమును ధరించి
తారకాసురుణ్ణి వధించి వీరునిగా నిలిచి, అమరులగు దేవబృందముచే నమస్కరించుబడు
వల్లీ నాథుడగు సుబ్రహ్మణ్య స్వామి, నాకు చేయూతనిమ్ము
పంచాక్షరాది మనుమంత్రిత గాంగతోయైః
పంచామృతైః ప్రముదితేంద్ర ముఖైర్మునీంద్రైః
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాధ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ (7)
ఎవరినైతే పంచాక్షర మంత్రము ఇతర మంత్రములు జపిస్తూ, పవిత్ర గంగా జలముతో అభిషేక స్నానం ఆచరింపచేసి
పంచామృత స్నానం ఆచరింపచేసి, శ్రేష్ఠులగు మునీంద్రుల సమక్షములో ఇంద్రునిచే
పట్టాభిషేకము గావింపబడి నాయకునిగా నియమింపబడ్డ
వల్లీ నాథుడగు సుబ్రహ్మణ్య స్వామి, నాకు చేయూతనిమ్ము
శ్రీ కార్తికేయ కరుణామృత పూర్ణ దృష్ట్యా
కామాదిరోగ కలుషీకృత దుష్ట చిత్తమ్
సిక్త్వాతు మామవ కళాధర కాంతి కాంత్య
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ (8)
ఓ కార్తికేయ, అమృత తుల్యమగు కరుణతో నిండియున్న నీ పరిపూర్ణమైన దృష్టిని మా యందు ప్రసరింపచేసి
కోరికలతో, రోగములతో, దుర్భుద్ధితో కలుషితమైన మా దుష్టమైన ప్రవర్తనను పవిత్రపరచుము
భక్తులను సత్వరముగా ఉద్ధరించుచు, సకల కళలకు నిధియై, గొప్ప కాంతితో ప్రకాశించుచున్న
వల్లీ నాథుడగు సుబ్రహ్మణ్య స్వామి, నాకు చేయూతనిమ్ము
సుబ్రహ్మణ్య అష్టకం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమాః
తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః
సుబ్రహ్మణ్య కరవలంబమిదం ప్రాతరుత్ధాయ యః పఠే
కోటిజన్మ కృతం పాపం తత్ క్షణ దేవ నశ్యతి
ఎవరైతే ఈ సుబ్రహ్మణ్య అష్టకం అనబడు ఈ పుణ్య స్తోత్రాన్ని పఠిస్తారో
వారి యందు సుబ్రహ్మణ్య దేవుడు ప్రసన్నుడై ముక్తిని, మోక్షమును ఇచ్చును
సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రంను ఉదయానే ఎవరైతే భక్తితో పఠిస్తారో
పూర్వజన్మలలో చేసిన పాపములన్ని అనతి కాలంలోనే పటాపంచలగుతాయి.
ఇతి శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం సంపూర్ణమ్